- ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
తెలంగాణ ప్రభ,పెద్దపల్లి: ప్రజల ఆకలిని తీర్చే అన్నదాతగా పేరుగాంచిన రైతన్నలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం అంతర్గాం మండల పరిధిలోని గోలివాడ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతన్నలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంక్షేమ ప్రణాళికలను రూపొందించి, పకడ్బందీగా అమలు చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందుతోందన్నారు. రైతులు పండించిన ప్రతి వరిగింజను ప్రభుత్వమే కొనుగోలు చేసి, సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలుస్తున్నారన్నారు.
రైతే రాజుగా సీఎం కేసీఆర్ గొప్ప పాలన కొనసాగుతోందని ఆయన అన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో రైస్ మిల్లర్లు ఎటువంటి కోత లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. రుతుపవనాలు రానుండడంతో అధికారులు ధాన్యం తరలింపులో ఎటువంటి అలసత్వం వహించకుండా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట సర్పంచులు ధరణి రాజేష్, బాధరవేణి స్వామి,బండారి ప్రవీన్ కో ఆప్షన్ మెంబర్ గౌస్ పాష, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతి నాయక్, నాయకులు కొల సంతోష్ గౌడ్ నుాకరాజు ఎలుక కోంరయ్య గీట్ల శంకర్ రెడ్డి గోపు కోమురయ్య యాదవ్ గంగాధరి శ్రీనివాస్, దొమ్మేటి వాసు, ఈదునూరి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
