తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట): మండలంలోని వల్లంపట్ల గ్రామంలోని రైతులకు ఆయిల్ ఫామ్ పంట సాగు గురించి రైతు వేదిక లో అవగాహన సదస్సు నిర్వహించారు,ఈ సందర్భంగా వ్యవసాయ విస్తరణ అధికారి అర్చన ఆయిల్ పామ్ పంట సాగు చేయడం వలన కలిగే లాభాలను , రైతులకి అవసరమైన మొక్కల సబ్సిడీ సంబధిత కంపెనీలు అందజేయడమే కాకుండా పండిన పంట సైతం కంపెనీ యాజమాన్యం కొనుగోలు చేస్తుంది అని వివరించారు, ఈ కార్యక్రమము లో క్లస్టర్ పరిధి లో సాగు చేసిన రైతులని సన్మానించి పంట కొనుగోలు ధృవీకరణ పత్రం ఇవ్వడం జరిగింది,
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కేతిరెడ్డి అనసూర్య వెంకట నరసింహారెడ్డి, ఎంపీటీసీ నాయిని స్రవంతి రమేష్ గౌడ్, పిఎసిఎస్ డైరెక్టర్ కట్ట సుధాకర్,ఏరియా మేనేజర్ సతీష్, క్లస్టర్ ఆఫీసర్ కార్తీక్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
.