కేరళ స్టోరి సినిమా వీక్షించిన బిజెపి నాయకులు

తెలంగాణ ప్రభ, (పెద్దపల్లి): దేశ ప్రజలు కేరళ స్టోరీ సినిమాను వాస్తవానికి అనుగుణంగా తీసినట్టు భావిస్తున్నారని రామగుండం బిజెపి నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ అన్నారు. దేశంలో కొంతమంది మతం పేరుతో కుట్రలు చేస్తున్నారని, అలాంటి ఘటనలను యావత్ సమాజం ఖండించాలన్నారు. పట్టణంలోని ఊర్వశి థియేటర్లో భాజపా శ్రేణులతో కలిసి లావణ్య అరుణ్  కేరళ స్టోరీ సినిమాను వీక్షించారు. 

ఈ సినిమా గురించి ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు చూసి చూడాలనుకున్నానని, పార్టీ కార్యకర్తల కోరిక మేరకు వారితో కలిసి చూసినట్టు తెలిపారు. కేరళ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా కేరళ స్టోరీ సినిమాలో చూపించినట్లుగా ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఈ చిత్రాన్ని వాస్తవ కథ ఆధారంగా తెరకెక్కించినట్టు దర్శక, నిర్మాతలు చెప్పారని  పేర్కొన్నారు. ఆడ బిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ పిడుగు కృష్ణ ముదిరాజ్, కార్పొరేటర్ దుబాసి లలిత మల్లేష్,  కాజీపేట శివాజీ ,బాందారపు మల్లికార్జున్  ,మామిడి రాజేష్, రాపోలు కుసుమ కుమారి, మాతంగి రేణుక,  గాండ్ల స్వరూప ,మదరబోయిన సమ్మయ్య యాదవ్, నారాయణ చారి, కొమ్ము శ్రీను, మామిడి వీరేశం, భాష బోయిన వాసు, భరత్, బుంగ మహేష్, అందే రాజ్ కుమార్ ,దాసరి కిషోర్ ,ఈదినూరి శ్రీకాంత్ ,తదితరులు ఉన్నారు.


.