దొంగ అరెస్ట్ : 2.5 తులాల బంగారం, 6 తులాల వెండి, 5 వేలు నగదు స్వాధీనం

తెలంగాణ ప్రభ,(కోరుట్ల) : ఈ నెల 11 న రహింపురా,  అధర్షనగర్ కాలనీలో తాళం వేసి ఉన్న రెండు ఇండ్లల్లో దొంగతనానికి పాల్పడిన దొంగను కోరుట్ల పోలీసులు పట్టుకున్నారు.  దానికి సంబంధించిన వివరాలను సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోరుట్ల సీ ఐ ప్రవీణ్ కుమార్ నిందితుదీని  ప్రవేశపెట్టి అందుకు సంబధించిన వివరాలను వెల్లడించారు. 

 కోరుట్ల పట్టణంలో తాళం వేసి ఉన్నఇండ్లే  లక్శ్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న కోరుట్ల పట్టణానికి చెందిన  ఎం. డి.ముజహీద్ ను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టినారు.  దొంగ వద్ద నుండీ 2.5 తులాల బంగారం, 6 తులాల వెండి, రూ 5 వేలు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శించిన ఎస్సై చిర్ర సతీష్, సిబ్బంది కానిస్టేబుల్  సత్తయ్య, ఎల్లయ్య లను సిఐ ప్రవీణ్ కుమార్ అభ్భినందించారు. నిందితుడి పై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.  

ప్రతి ఇంట్లో సిసి కెమెరా ఏర్పాటు చేసుకోవాలి

- కోరుట్ల సీఐ ప్రవీణ్ కుమార్

దొంగతనలను అరికట్టడంలో సీసి కెమెరాలు ఎంతో తోడ్పాటు ఇస్తాయని, సి సి కెమెరా ఏర్పాటు వలన దొంగతనాలు జరిగినప్పుడు దొంగలను ఇట్టే పట్టేయవచని తెలిపారు.

.