తెలంగాణ ప్రభ(సిరిసిల్ల) నిర్ణీత సమయంలో వాహనాల టాక్స్ లు బకాయిలు చెల్లించాలని కోరుతూ తెలంగాణ సాంస్కృతి సారధి ఆధ్వర్యంలో కళాకారులు అవగాహన ప్రదర్శనలు నిర్వహించారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణంలో తంగల్పల్లి మండల కేంద్రంలో రవాణా శాఖ నిర్వహించిన కళ ప్రదర్శనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. పెండింగ్ లో ఉన్న టాక్సు ను 50% పెనాల్టీతో స్వచ్ఛందంగా చెల్లించవచ్చని. కట్టని పక్షనా వాహన తనిఖీలు పట్టుబడితే 200% భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రదర్శనల ద్వారా తెలియజేశారు. సాంస్కృతిక సార థి రాజన్న సిరిసిల్ల జిల్లా టీం లీడర్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు శ్రీరాముల రామచంద్రం, గడ్డం శ్రీనివాస్, గుగ్గిళ్ళ పరశురాములు, వంతడుపుల గణేష్ లు ప్రజలకు అవగాహన కలిగేలా ప్రదర్శనలు నిర్వహించారు.
