మద్యం వ్యాపారులతో ఎక్సైజ్ అధికారుల కుమ్మక్కు?

. తగ్గిన ధరలను వెంటనే అమలు చేయాలి

. సిపిఐ నాయకులు మద్దెల దినేష్

తెలంగాణ ప్రభ , (పెద్దపల్లి): రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రభుత్వం తగ్గించిన ధరలు ఇంకా అమలుకు నోచుకోవడం లేదని సిపిఐ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

పాత స్టాకు ఉన్నంత వరకు బాటిల్పై ఉన్న ధరల లేబుల్ ప్రకారమే అమ్మకాలు చేస్తామని మద్యం వ్యాపారులు బహిరంగ గానే చెబుతున్నారని, మద్యం వ్యాపారులకు గోదావరిఖని ఎక్సైజ్ శాఖ అధికారులు వంత పాడుతున్నారా, అని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వం గతంలో భారీగా మద్యం ధరలు పెంచటంతో అమ్మకాలు తగ్గాయని, ఆదాయం పడిపోతుండటంతో ప్రభుత్వం మే 5న మద్యం ధరలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన అన్నారు.

ఫుల్ బాటిల్ పై రూ.40, హాఫ్ బాటిల్పి రూ.20, క్వార్టర్ బాటిల్పై రూ.10 చొప్పున ధరలను తగ్గించారని పేర్కొన్నారు.

మద్యం వ్యాపారులు మరియు ఎక్సెజ్ అదికారులు కుమ్మకై ప్రజల దగ్గర దోచుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మద్యం ధరలు తగ్గించి పాత రెట్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు, లేకుంటే ఎక్సెజ్ కార్యాలయం ముందు ఆందోళనలు తప్పవని దినేష్ హెచ్చరించారు.

.