తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి ఉమ్మడి మండలలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని అధికారులు ప్రజాప్రతినిధులు నిర్వహించారు. విద్యార్థులు పాఠశాల నుండి బస్టాండ్ వరకు ర్యాలీగా వచ్చి అంబేద్కర్ చౌరస్తాలోని అధికారులతో పాటు విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ ....ఇంటి చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొక్కలను ప్రతి ఒక్కరు నాటి వాటిని కాపాడాలని అన్నారు .ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కేఆర్ మనోహర్ రెడ్డి ఈవో ముజఫర్ బేగ్ అంగన్వాడీ టీచర్లు గ్రామపంచాయతీల కార్యదర్శిలు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
