సెస్ కార్యాలయంలో మెడికల్ క్యాంప్

సిరిసిల్ల. (తెలంగాణ ప్రభ). సిరిసిల్ల సహకా విద్యుత్ సంస్థ సెస్ లో ఉద్యోగులకు ఉచిత మెడికల్ క్యాంప్ శుక్రవారం నిర్వహించారు. యశోద హాస్పిటల్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపులో సేస్ పాలకవర్గ సభ్యులతో కలిపి 2 36 మందికి వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో యశోద హాస్పిటల్ డాక్టర్లు డాక్టర్ సత్య దీప్, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ అభిషేక్ వైద్య సేవలు అందించారు. మేనేజర్ విజయ్ కుమార్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి,  అంజిరెడ్డి, నారాయణరావు, ఎండి శ్రీనివాస్ రెడ్డి, ఏ ఏ ఓ లు రాజేందర్, దేవేందర్ ఉమేరా ఎల్డిసి జ్యోతి రెడ్డి, శివాని సిబ్బంది పాల్గొన్నారు.

.