చేతి మగ్గంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంకు వస్త్రాలు.
తొలిసారిగా చేతిమగ్గంపై లేనిన్ కాటన్.
తెలంగాణ ప్రభ (సిరిసిల్ల): చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ అరుదైన ప్రతిభను కనబరిచారు. ఇప్పటికే అనేక కళారూపాలు చేతి మగ్గంపై రూపకల్పన చేసిన హరి ప్రసాద్ ప్రతిభ జాతీయస్థాయిలో ప్రాచుర్యం పొందిన విషయం తెలిసింది. దేశ ప్రధాని మోడీని సైతం హరిప్రసాద్ ప్రతిభ అబ్బుర పరిచింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల పట్టణానికి చెందిన వెల్ది హరిప్రసాద్ చేనేతలో అరుదైన రికార్డులు తన సొంతo చేసుకుంటూ వస్తున్నారు. గతంలో హరి ప్రసాద్ ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జ్ఞాపికను తయారుచేసిన విషయాన్ని తెలుసుకున్న ఆయన అభిమాని ఒకరు హరి ప్రసాద్ కు కొత్త ఆర్డర్ ఒకటి ఇచ్చారు. సుమారు 6 లక్షల విలువ కలిగిన ఆర్డర్ అందించినట్లు హరి ప్రసాద్ తెలిపారు. హరి ప్రసాద్ భార్యతో కలిసి 25 రోజులపాటు శ్రమించి వస్త్రాలను తయారు చేసినట్లు తెలిపారు. జనసేన లోగో తో 100 నెంబర్ దారంతో లెనిన్ కాటన్ ఉపయోగించి వస్త్రాన్ని తయారు చేసినట్లు తెలిపారు. సిరిసిల్లలో తొలిసారిగా లెనిన్ కాటన్ ఉపయోగించడం ఇదే తొలిసారి. 2019 నుండి ప్రతి చేనేత దినోత్సవానికి ఏదో ఒక అరుదైన కళారూపాన్ని రూపొందించి హరిప్రసాద్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వస్త్రాలు తయారుచేసి ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారాని కి ఆహ్వానించినా వెల్లె ఆర్థిక పరిస్థితి లేక వెళ్లలేకపోయానని వినమ్రంగ తెలిపే చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరుకుందాం.
