తెలంగాణ ప్రభ (కోరుట్ల): ఇటీవలే అండర్ 12 రన్నింగ్ పోటీలలో జిల్లాస్థాయిలో ప్రథమ శ్రేణిలో గెలుపొంది, రాష్ట్రస్థాయిలో రాణించి ప్రశంసా పత్రం స్వీకరించిన సందర్భంగా ధర్మారం పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు.
ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉపసర్పంచ్ దొడ్డ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ నేటి విద్యార్థులు అందరూ చదువుతో పాటు ఆటల్లో ప్రతిభా పాటవాలు చూపాలని, ఫోన్లో కాలక్షేపం చేయకుండా క్రీడా ప్రాంగణాల వైపు దృష్టి మళ్లించాలని, తద్వారా శారీరక సౌష్టవాన్ని పెంపొందించుకోవాలన్నారు హర్షవర్ధన్ లాంటి అరుదైన విద్యార్థులు నేటి విద్యార్థి లోకానికి ఆదర్శప్రాయమని వారిని స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో రాణించాలని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నవీన్ ప్రసాద్, విష్ణువర్ధన్ రాజు, వందనా, రమ్య, ఫర్జానా బేగం, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు
.