ఎస్సీ వర్గీకరణపై సుప్రీం చారిత్రాక తీర్పు : ప్రముఖ న్యాయవాది తంగళ్ళపల్లి వెంకటి

తెలంగాణ ప్రభ (సిరిసిల్ల) ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు ను ప్రముఖ న్యాయవాది తంగళ్ళపల్లి వెంకటి స్వాగతించారు. గొప్ప తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30ఏళ్ల సుదీర్ఘ సమస్యకు నేడు పరిష్కారం లభించిందన్నారు. ఎన్నో ఏళ్ల పోరాటానికి నేడు ఫలితం లభించిందనీ, ఎన్నో త్యాగాలకు గౌరవం దక్కిందన్నారు.

 దశాబ్దాల కల నెరవేరిందని మాదిగ సామాజిక వర్గానికి ఇది పండుగ రోజు అని ఇంటింటా సంబురాలు జరుపుకునే రోజనీ అన్నారు.ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. వచ్చే ప్రభుత్వ నోటిఫికేషన్లలో,  విద్య, ఉద్యోగ అవకాశాల్లో యువతకు అవకాశం కల్పించాలని కోరారు.

.