అంగన్వాడి సెంటర్లలో తల్లిపాల వారోత్సవాలు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో అంగన్వాడి సెంటర్లలో తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమాన్ని పురస్కరించుకొని పాల్గొన్న మూడవ వార్డు కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీనారాయణ  పిల్లలకు అన్నప్రసన మరియు అక్షరాభ్యాసం నిర్వహించి, పిల్లల పెరుగుదల అలాగే పిల్లల బరువు గురించి తెలుసుకున్నారు. 

ఇట్టి కార్యక్రమం సందర్భంగా కౌన్సిలర్  మాట్లాడుతూ తల్లిపాలు పిల్లలకు మరియు తల్లులకు రోగనిరోధక శక్తిని పెంచుతున్నది దానివల్ల తల్లికి మరియు పిల్లలకి అంటువ్యాధులు ప్రభావం ప్రబలకుండా నిరోధక శక్తిని పెంచే అవకాశం చాలా ఉన్నాయి, 

కాబట్టి తల్లి ప్రసవించిన కొన్ని నిమిషాలలో తల్లిపాలు పిల్లలకి పట్టించడం ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే అంగన్వాడి సెంటర్లలో తప్పనిసరిగా చేయించుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సౌకర్యాలు తల్లులకు మరియు పిల్లలకు అందుతాయి అలాగే అంగన్వాడి సెంటర్లలో వచ్చే పౌష్టికరమైనటువంటి ఆహారం గర్భిణీలకు అలాగే పిల్లలకు సరైన సమయంలో తీసుకున్నట్లయితే చాలా మటుకు తల్లులు మరియు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపినారు. ఇట్టి కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ హేమలత అంగన్వాడీ టీచర్లు ఆయాలు అలాగే వార్డు తల్లులు మరియు పిల్లలు పాల్గొన్నారు.

.