అర్హులైన జర్నలిస్టులకు నివేశ స్థలాలు ఇవ్వండి జిల్లా పాలనాధికారికి మన ప్రెస్ క్లబ్ కోరుట్ల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేత

తెలంగాణ ప్రభ (కోరుట్ల):జగిత్యాల జిల్లాలో అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ నివేశ స్థలాలు ఇవ్వాలని మన ప్రెస్ క్లబ్ కోరుట్ల ఆధ్వర్యంలో బుధవారం జిల్లా పాలనాధికారి సత్య ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోరుట్ల పట్టణంలో ఇటీవల జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించడం జరిగింది. అట్టి జర్నలిస్టులకు ఇచ్చిన ఇళ్లలో చాలా మటుకు అనర్హులకు కేటాయించి అర్హులకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు.  

జగిత్యాల జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% రాయితీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటివరకు కోరుట్లలో ఎవరికి అధికారికంగా ఇండ్ల స్థలాలు, ఇళ్లు కేటాయించలేదని, అర్హత ఉన్నవారు రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లో  సీనియారిటీ ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

అర్హతను బట్టి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని స్పష్టం చేశారు. 

కలెక్టర్ ను కలిసిన వారిలో మన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉరుమడ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అల్లే రాము, పాత్రికేయులు లింగ ఉదయ్ కుమార్, కొండ్లెపు అర్జున్, కత్తిరాజ్ శంకర్, చిట్యాల గంగాధర్, వన తడుపుల నాగరాజు, కోడూరి ప్రేమ్, చింతోజి రాధాకృష్ణ  తదితరులు పాల్గొన్నారు.

.