గోనె ఎల్లప్ప, కాంగ్రెస్ పార్టీ చేనేత సెల్ జిల్లా అధ్యక్షులు.
బిఆర్ఎస్ విమర్శలు అర్ధరహితం.
తెలంగాణ ప్రభ ( సిరిసిల్ల): మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్ల నేతన్నలకు అన్నం పెట్టిండో సున్నం పెట్టిండో ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ చేనేత సెల్ జిల్లా అధ్యక్షులు గోనె ఎల్లప్ప అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎల్లప్ప మాట్లాడుతూ బిఆర్ఎస్ నాయకులు మీడియా ముఖంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. 2009లో ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంత్యోదయ కార్డులు ఉచిత విద్యుత్ అందించిందని అన్నారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి అంత్యోదయ కార్డులు అందించారని తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పనిచేసిన కేటీఆర్ హయాంలోని అంత్యోదయ కార్డులు 3వెలకు పడిపోయాయని తెలిపారు. సహకార రంగంలో ఉన్న స్పిన్నింగ్ మిల్లు మంత్రి అనుచరులే కొనుగోలు చేసి సిరిసిల్ల నేతన్నలకు సున్నం పెట్టింది బిఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ హయాంలోనే 21 కోట్ల విద్యుత్ బకాయిలు పెరిగిపోయిన విషయం, 270 కోట్లు బకాయిలు పెట్టి పరిశ్రమను కుప్ప కుల్చరని ఆరోపించారు.బతుకమ్మ చీరల ఆర్డర్ తో ఎవరు ఎక్కువ లాభపడ్డారు పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సబ్సిడీ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిస్తే మాఫీ చేసే విషయంలో హామీ ఇచ్చారని అన్నారు. తప్పు బిఆర్ఎస్ పార్టీ దగ్గర పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి విమర్శించడం సరికాదని అన్నారు. అన్ని సమస్యలకు కారణమై నేతన్నలకు సున్నం పెట్టి బిఆర్ఎస్ పార్టీ నాయకుల విమర్శలు నేతన్నలు అర్థం చేసుకోవాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వెలమల తిరుపతిరెడ్డి ,కాముని నలిని కాంత్, కౌన్సిలర్ వేముల రవి , కుడిక్యాల రవి, పిస్మ మధు తదితరులు పాల్గొన్నారు.
