మాదిగ ఐక్య కార్యచరణ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా లింగంపల్లి మధుకర్.

తెలంగాణ ప్రభ ( సిరిసిల్ల): తెలంగాణ మాదిగ ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా లింగంపల్లి మధుకర్ ఎన్నికయ్యారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి సోమవారం మధుకర్ నియామకాన్ని ప్రకటించారు. లింగంపల్లి మధుకర్ సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్ద బోనాల గ్రామానికి చెందినవారు. విద్యార్థి నాయకుడిగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుడిగా రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. తన నియామకానికి సహకరించిన పిడమర్తి రవికి తోటి సహచర్లకు మధుకర్ కృతజ్ఞతలు తెలిపారు.

.