ఘనంగా బోనాల పండుగ

పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు చేసిన కొలను హనుమంత్ రెడ్డి

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): తెలంగాణ ఆషాడ బోనాల పండుగ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, దుండిగల్ మున్సిపాలిటీ  పలు ఆలయాలకు ముఖ్యఅతిథిగా వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరికీ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు  సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


.