భవిష్యత్ లో ఉన్నతస్థాయి ఉద్యోగం సాధించాలి : రసమయి బాలకిషన్

తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మేన్ : మానకొండూర్ శాసన సభ్యులు

 తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట): మండల కేంద్రంలోని కేరళ మోడల్ హైస్కూలులో పదవతరగతి చదివి బుధవారం విడుదలైన పది ఫలితాల్లో 10 జీపీఏ మార్కులు సాధించిన మండల కేంద్రానికి చెందిన ఎగుర్ల నందిని అనే విద్యార్థినిని మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ గురువారం ఇల్లంతకుంట లో శాలువాతో సన్మానించారు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్ లో బాగా చదివి ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించాలని ఆకాంక్షించారు, అనంతరం పాఠశాల యాజమాన్యం విద్యార్థినికి ₹5000ల చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు,ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య యాదవ్, ప్రిన్సిపల్ కృష్ణకుమార్, నాయకులు తూటి పర్శరాం,తదితరులు ఉన్నారు.

.