తెలంగాణ ప్రభ, (సిరిసిల్ల): ప్రగతి శుభోదయం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో రైని డే కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఎం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ వర్షం యొక్క ప్రాముఖ్యత వివరించడంతో పాటు విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పలు సూచనలు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలిచాయి. కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ లావణ్య, స్వర్ణలత, సాయి ,ప్రియ జ్యోతి, లత, కల్పన, కవిత ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
