తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల పరిధిలోని ఎత్తోండ గ్రామంలో శుక్రవారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. సిఎం, వ్యవసాయ శాఖ మంత్రి, శాసనసభ్యులు పోచారం తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్, చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.అనంతరం టపాకాయలు పేల్చి రైతులకు మిఠాయిలు పంచిపెట్టారు .
గ్రామ పార్టీ అధ్యక్షులు షేక్ తయ్యబ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులకు అండగా నిలబడే పార్టీ అని కొనియాడారు .ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీని అమలు చేసిందని రైతులకు తెలిపారు. మా గ్రామ రైతుల తరఫున సీఎం రేవంత్ రెడ్డికి వ్యవసాయ మంత్రికి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రో చైర్మన్ కు ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎస్.ఏ. ఖాదర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అగ్గు లింగయ్య బోనికే గంగాధర్ యూత్ అధ్యక్షులు షేక్ రఫీ సాయిబాబు చందూరు సాయిలు కోటగిరి మండల మైనారిటీ ఉపాధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ మాజిద్ నిజామాబాద్ గంగారం శోభి కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
