తిమ్మాపూర్ లోఘనంగా హనుమాన్ శోభయాత్ర.

తెలంగాణ ప్రభ (తిమ్మాపూర్):  కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని గ్రామంలో హనుమాన్ భక్తుల ఆధ్వర్యంలో బుధవారం హనుమాన్ శోభయాత్రను భక్తులు ఘనంగా నిర్వహించారు. హనుమాన్ స్వామికి ప్రత్యేక పూజలు చేసి గ్రామంలో ప్రజలు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. జై శ్రీరామ్ జై హనుమాన్ నామస్మరణంతో గ్రామం అంతా మారుమోగింది. హనుమాన్ మాల ధరించిన భక్తులు హనుమాన్ నగర్ దేవాలయం నుండి తిమ్మాపూర్ గ్రామంలో హనుమాన్ పాటలు పాడుకుంటూ భజన చేశారు. గ్రామ ప్రజలను చల్లగా చూడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి మాదన వీరయ్య, హనుమాన్ భక్తులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

.