తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండలకేంద్రంలో యశశ్రీ పాఠశాలలో మండల ఆరోగ్య అధికారి సిర్ప గోవర్ధన్ విద్యార్థులకు సీసనల్ వ్యాధులు, కిటక జనిత వ్యాధుల పైన అవాగాహన కల్పించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని విద్యార్థులకు సూచించారు. ఇంటి పరిసరాలలో పాత కుండీలో, కొబ్బరి బొండాలలో, పగిలిన వస్తువులలో నీరు నిలవ ఉండకుండా జాగ్రత్తలుతీసుకోవాలన్నారు. పరిశుభ్రమైన నీరు త్రాగాలని తెలిపారు. సీసనల్ వ్యాధులు, దోమల ద్వారా వచ్చే వ్యాధులు, కలుషితం కలిగిన నీరు వల్ల వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియచేసి అవగాహన కలిగించటం జరిగింది. ఈ కార్యక్రమంలో యశశ్రీ ప్రధానోపాధ్యాయురాలు మాధవి, ఆరోగ్య సిబ్బంది రోజా, మంజుల ఆశ వర్కర్లు అనురాధ, గంగామణి, స్వప్న పాల్గొన్నారు.
