తెలంగాణ ప్రభ (కోటగిరి): రాష్ట్ర ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా కాసుల బాలరాజు నియమిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేయడంతో కోటగిరి అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టపాకాయలు పేలుస్తూ నాయకులు పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా మాజీ ఎంపీటీసీ కొట్ట మనోహర్ మాట్లాడుతూ... బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేసిన వ్యక్తి కాసుల బాలరాజ్ అని కొనియాడారు. నియోజకవర్గంలో మండలాలలో,గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండటానికి ఆయన ముందుండి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని కాంగ్రెస్ నాయకులకు మనోధైర్యాన్ని కల్పిస్తూ పార్టీ నిలబెట్టిన వ్యక్తి అని పేర్కొన్నారు.రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ, ఆయన చేసిన సేవలను నమ్మి రాష్ట్ర ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ నియమించడం జరిగిందని అన్నారు. కాసుల బాలరాజు నియామకం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోటగిరి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి మెలిసి పనిచేసి మండలాన్ని అభివృద్ధి చేయాలని కార్యక్రమ సందర్భంగా తెలిపారు. కార్యకర్తలు అందరిని ఏకతాటిపై ఉంటూ వర్గ విభవిధాలకు చోటు ఇవ్వకుండా మండలాల అభివృద్ధికి నియోజకవర్గంలో అభివృద్ధిని కొనసాగించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఆనంద్ ఎంపిటిసి కొట్టం మనోహర్ వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు బర్ల మధు నాయుడు కోటేశ్వరరావు కిషోర్ బాబు బర్ల రవి సాయిలు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
