కళ్యాణ లక్ష్మి మరియు షాధి ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్..

తెలంగాణ ప్రభ (కోరుట్ల): మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట్,హుస్సేన్ నగర్, రాఘవపేట్, నడికుడ, మొగిలిపేట్, ఓబులాపూర్, సంగేoశ్రీరాంపూర్, దామరాజ్ పల్లి, వాల్గొండ, మల్లాపూర్, గొర్రెపల్లి, వేంపల్లి వెంకట్రావుపేట్, రేగుంట, సాతారం, గుండంపల్లి, ఫ్యాక్టరీ చిట్టాపూర్, సిర్పూర్, కుస్తాపూర్, రత్నాపూర్ మొత్తం (63,07,308) ఆరవై మూడు లక్షల ఏడువేల మూడు వందల ఎనిమిది రూపాయల విలువ గల 63 కల్యాణ లక్ష్మి, మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

ఈ కార్యక్రమంలో వారితోపాటు మాజీ జడ్పిటిసి సంధిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కాటిపల్లి సరోజన ఆదిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తోట శ్రీనివాస్,దేవా మల్లన్న, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

.