డా.బి అర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ను మర్యాద పూర్వకంగా కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్

తెలంగాణ ప్రభ (కోరుట్ల): నూకపల్లి లో డబల్ బెడ్ రూం ఇండ్ల విద్యుత్ పనుల కోసం నిదులు మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేసిన జగిత్యాల శాసన సభ్యులు డా సంజయ్ కుమార్ ..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ జగిత్యాల పట్టణములో బీద బడుగు బలహీన, మైనారిటీ, SC/ST, బిసి,ఓసి వర్గాల పేద ప్రజల కొరకు గానూ నూకపల్లి గ్రామ పరిధిలో 4520 ఇండ్లతో ఒక అర్బన్ హౌసింగ్ కాలనీ నిర్మాణము చేపట్టడము జరిగినది. ఇందులో, ఇంత వరకు 3720 గృహములు పూర్తి చేయబడి లబ్ధి ధారులకు కేటాయించడము జరిగినది. ఇంకానూ 800 ఇండ్ల వరకు గృహములు నిర్మాణము పూర్తి దశలో వున్నవి.ఇంత పెద్ద కాలనీలో ప్రజలకు లబ్దిదారులకు సౌకర్యం కల్పించుట ప్రస్తుతము అత్యధిక ప్రాదాన్యత గల అంశము అని నిధుల మంజూరీ అవసరము అని,ప్రజలు నివాసము వుండుటకు అవసరమగు విధ్యుత్ శక్తి లైన్ లు, విధ్యుత్ పానెల్ బోర్డు ల కోసం  జగిత్యాల 2 bhk కాలనీ నూకపల్లిలో లబ్దిదారులకు పూర్తి విద్యుత్ సౌకర్యములు కల్పించుటకు గానూ  నిధులు మంజూరీ చేయగలరని వినతి పత్రం అందజేశారు., ఈసందర్భంగా ఉప ముఖ్యమంత్రి నిధుల మంజూరుకు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.

.