తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు మైనారిటీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద బక్రీద్ పండుగలో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ అల్లాకు తన కొడుకును బలిచ్చేందుకు ఒక తండ్రి సన్నద్ధమవగా, వారి త్యాగాలకు మెచ్చిన అల్లా కొడుకుకు బదులుగా ఒక బక్రీని బలివ్వమని తెలుపగా నాటి నుంచి బక్రీద్ పండుగ ప్రారంభమైందన్నారు. ముస్లిం సోదరులు అత్యంత ఆనందోత్సవాల మధ్య తమను తాము అల్లాకు సమర్పించుకుంటూ పేదవారికి సహాయం చేస్తూ నిర్వహించుకునే పండుగలలో ఒకటి బక్రీద్ అని ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు మైనారిటీ నాయకులు, కార్యకర్తలు, బిఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
.