ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కటుకం గణేష్ కు అవార్డు ప్రదానోత్సవం...

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంతోపాటు ఎనలేని సేవలు చేసిన రక్తదాతలకు అవార్డు సర్టిఫికెట్ ప్రదానోత్సవం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా కోరుట్లకు చెందిన సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త, చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కటుకం గణేష్ ను ఘనంగా అభినందిస్తూ అవార్డు సర్టిఫికేట్ అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో రక్తదాతలతోపాటు యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి  రక్తదానం చేస్తూ ప్రజలకు అత్యవసర సమయాల్లో ప్రాణదాతలుగా నిలుస్తున్నారని, దానితోపాటు ఈ యొక్క దాతలు మరికొంతమంది యువతని రక్తదానంపై అవగాహన కల్పిస్తూ రక్తదానం చేసేలా ఎంతగానో కృషి చేస్తున్నారని, వారి సేవలు వెలకట్టలేమని వారు అభినందించారు. 

అలాగే రక్తదానం మహాదానం అంటూ అమ్మ జన్మనిస్తే రక్తదాత పునర్జన్మని ఇస్తాడు అని కొనియాడారు. 

ఈ కార్యక్రమం ద్వారా అవార్డు సర్టిఫికెట్లు పొందిన రక్తదాతలు జగిత్యాల జిల్లాలో ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించి రక్తదాతాలను ప్రోత్సహిస్తూ వారిని గుర్తించి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు మాకు తగిన గౌరవం ఇచ్చినందుకు జగిత్యాల జిల్లా రక్తదాతలు అందరి తరపున ప్రత్యేక హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆరోజు రాజకుమార్, కతురోజ్ శ్రీనివాస్, మంచాల కృష్ణ, కొమురవెల్లి వేణుగోపాల్, వెంకటేశ్వరరావు, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సమిరుద్దీన్, టీవీ సూర్యం, ఏవిఎల్ఎన్ చారి, డాక్టర్ ప్రవీణ్, రామకృష్ణ, నరేష్, డాక్టర్ త్రిశ్నా తదితరులు పాల్గొన్నారు

.