తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో పట్టణంలో 5 వేల ఓట్లు, నియోజకవర్గంలో 33 వేల ఓట్ల మెజారిటీ అందించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్ మాట్లాడుతూ
ఈ విజయం వెనుక ప్రతి బీజేపీ కార్యకర్తలు తమ అకుంటిత శ్రమ ఎర్రటి మండుటెండలలో సైతం లెక్కచేయకుండా పార్టీ గెలుపుకోసం కష్టపడ్డ తీరును అయన కొనియడారు.
ఆలాగే నియోజకవర్గం నుండి బీజేపీకి ఓటు బ్యాంకు 93000 వేల మార్కును దాటించి, పట్టణంలో 5000 వేల పైచిలుకు మెజారిటీ సాధించిన ప్రతి బూత్ అధ్యక్షుడికి, శక్తి కేంద్ర ఇంచార్జ్ లకు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు పెరు పేరున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఫుల్ టైమర్ పార్టీకి 24/7 సమయం కేటాయించి కష్టపడిన రాగుల రాజు కి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్, ఓ బి సి మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఇట్యాల నవీన్ కుమార్, జిల్లా నాయకులు ఇందూరి తిరుమలవాసు, కస్తూరి లక్ష్మినారాయణ, తులసి కృష్ణ, పట్టణ ఉపాధ్యక్షులు ఎర్ర రాజేందర్, గుద్దెటి రాజేందర్,కంటం ఉదయ్, పట్టణ కిసాన్ మోర్చ అధ్యక్షులు ఏళ్ళల నారాయణ రెడ్డి, దళిత మోర్చ అధ్యక్షులు బెక్కం అశోక్, బూత్ అధ్యక్షులు పత్తి సురేష్, దుర్గ ప్రసాద్, తైదల ప్రశాంత్, MS అక్మల్, చిట్యాల రాజేందర్, వాసం లోకేష్, గుండేటి శివ, కొండ నవీన్, మూల్క మణిరాజ్, నరేష్ , బీజేపీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
.