తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రవేశాల కొరకు అధ్యాపకులు ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. గురువారం మండలంలోని పదిర, రాగట్లపల్లి, నారాయణపురం గ్రామాల్లో అధ్యాపకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఉచిత విద్యను అందిస్తున్నామనీ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనుభవం కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన , విశాలమైన గదుల సౌకర్యం, ఉచిత పుస్తకాలు, పోటీ పరీక్షలకు అనుగుణంగా బోధన, ఉపకార వేతనాలు అందించబడుతాయనీ, తెలిపారు. ఎన్.ఎస్.ఎస్ ద్వారా సామాజిక సేవకులను తయారు చేయడం, సాంస్కృతిక , క్రీడల్లో ప్రోత్సాహం జిల్లా , రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం, సృజనాత్మక కార్యక్రమాలను నిర్వహించడం, ప్రతిభావంతులైన విద్యార్ధులకు ప్రోత్సాహక బహుమతులు , ప్రతిభా పురస్కారాలు,వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని, ప్రభుత్వ కళాశాలలో చేరాలనీ తెలియజేశారు. అధ్యాపకులు వాసరవేణి పర్శరాములు,కొడిముంజ సాగర్ ,తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.
