జువ్వాడి కృష్ణారావు చేసిన ఆరోపణలను ఖండించిన మెటుపల్లి బిఆర్ఎస్ నాయకులు

తెలంగాణ ప్రభ (కోరుట్ల):జగిత్యాల్ జిల్లా మెటుపల్లి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు మెటుపల్లి మండల ఎంపీపీ మారు సాయి రెడ్డి అధ్యక్షతన పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో ఎంపీపీ మారు సాయిరెడ్డి మాట్లాడుతూ.... నిన్న కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు ఖండిస్తూ ఐదుసార్లు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేలుగా కల్వకుంట్ల విద్యాసాగర్ రావును మొన్నటి ఎన్నికల్లో సంజయ్ ని ఎన్నుకున్నారని, పూర్తి మద్దతు తెలిపారని ఆయన అన్నారు నియోజకవర్గంలో అత్యధిక అభివృద్ధి జరిగిందని, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభివృద్ధి కనబడుటలేదని, అవినీతి ఎక్కడ జరిగిందో నిరూపణ జరపాలని, లేదంటే నియోజకవర్గం ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

అదేవిధంగా ఫోన్ టాపింగ్ పై కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు ఆరోపణలు ఖండిస్తున్నామని ప్రజల మద్దతుతో గెలిచిన సంజయ్ ని గెలుపును ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని, ఇది ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో దారిశెట్టి రాజేష్, తిరుపతిరెడ్డి,కౌన్సిలర్ బంగారు కాళ్ళ కిషోర్,ఆకుల ప్రవీణ్, మొరపు తేజ,వెంకటేష్,ప్రణయ్ గౌడ్ ,శ్యామ్,నరేష్ ,సతీష్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

.