మున్నూరు కాపు సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గా బండారి బాల్ రెడ్డి ఏకగ్రీవం

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు సంఘం ప్రచార కార్యదర్శి గా బండారి బాల్ రెడ్డి, జిల్లా  కోశాధికారి గా బండలింగంపల్లి కి చెందిన తడకల  దేవరాజు లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా ఎన్నికల ఆడ్ హాక్ కమిటీ అధ్యక్షులు అగ్గి రాములు తెలిపారు,

అట్టి నియామక పత్రాలను ఇరువురి కి  రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య, రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన అధ్యక్షులు బొప్పా దేవయ్య, జిల్లా ప్రదాన కార్యదర్శి శంకర్ , జిల్లా ఆడ్ హాక్ ఎన్నికల కమిటీ అధ్యక్షులు అగ్గి రాములు కలిసి అందజేసి శాలువాలు కప్పి పూలమాలలు వేసి సన్మానించారు,

ఈ సందర్భంగా  బండారి బాల్ రెడ్డి మాట్లాడుతూ తన  ఏకగ్రీవ నియామకానికి సహాకరించిన రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య కు , జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య కు ప్రదాన కార్యదర్శి శంకర్ కు ఆడ్ హాక్ కమిటీ ఎన్నికల అద్యక్షులు అగ్గి రాములు కు ఎల్లారెడ్డిపేట మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు నంది కిషన్ కు మున్నూరు కాపు కుల బంధువులకు బండారి బాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు, 

జిల్లా మున్నూరు కాపు సంఘం అబివృద్ధి కి కుల బంధువుల  సమస్యల సాధనకు  ప్రభుత్వ విప్  వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ , సిరిసిల్ల శాసన సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి  గార్ల సహాకారంతో కృషి చేస్తానన్నారు,

.