మెటుపల్లిలో బిఆర్ఎస్ కార్యాలయంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ప్రెస్ మీట్

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా మెటుపల్లి పట్టణంలోని బిఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి వయసు పెరిగింది, కానీ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు.మొన్న జరిగిన ఎలక్షన్ లో బిజెపి,బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని అన్నారు.

గతంలో బీజేపి ఎంపీ అరవింద్ కు సపోర్ట్ చేసింది మీరు కాదా అని అన్నారు.

వయసుకు మించి ఏదో ఏదో మాట్లాడుతున్నారు గతంలో మీకు ప్రజలే బుద్ధి చెప్పారు.

అది మర్చిపోయారా.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినా చేసింది ఏమీ లేదు. బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పెద్దలు అన్న గౌరవం లేకుండా వాడు వీడు అని  మాట్లాడతారు. 

గెలుపైన ఓటమైన ప్రజలే నిర్ణయిస్తారు.

ఇకముందైన వయసుకు తగ్గ మాటలు మాట్లాడాలని, మీ రాజకీయ అనుభవము అంతా నాకు వయసు లేదు మీరంటే గౌరవం కలదు అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రాణవేని సుజాత,ఎంపీపీ సాయిరెడ్డి ఉన్నారు.

.