ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులను శిక్షించాలి

పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ 

తెలంగాణ ప్రభ (కోరుట్ల): గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడి గత అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు ఓటమికి కారణం అయిన వారిని గుర్తించి వెంటనే కఠినంగా శిక్షించాలని కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు 

ఇలాంటి సిగ్గుమాలిన వ్యవహారానికి పాల్పడడం దురదృష్టకరమన్నారు ఇందులో భాగంగా మంగళవారం కోరుట్ల పట్టణ జువ్వాడి కృష్ణారావు నివాసం జువ్వాడి భవన్ లో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు 

ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో జువ్వాడి నర్సింగరావు ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా కోరుట్ల నియోజకవర్గ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతల కదలికలను ముందుగానే గుర్తిస్తూ వారి యొక్క అనుచరులను అడుగడుగున భయభ్రాంతులకు గురి చేసిన కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ లు డబ్బులు ముట్ట చెప్పుతూ బాండ్ పేపర్లు రాయించుకుంటూ ప్రజలను, కౌన్సిలర్లను నాయకులను బలవంతంగా  కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తూ వాట్సాప్ ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ లాంటి ఫేక్ ఐడిలను సృష్టించి జువ్వాడి నర్సింగారావు నైతికతను దెబ్బతీసే విధంగా వాళ్లు ఆనాడు వివరించడం జరిగిందని కోరుట్ల నియోజకవర్గంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ఎన్నికల్లో ఎవరిని కలుస్తున్నారో పక్కా సమాచారంతో వాళ్లను ముందస్తుగా వారి ఫోన్ లను ట్యాపింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగిందని, దీనికి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ కోరుట్ల ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ రాజీనామా చేయాలన్నారు  మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు 

ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్రధారులు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందర్నీ ప్రభుత్వం వెంటనే అరెస్టు చేసి వారిని కఠినంగా శిక్షపడే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నామన్నారు అనంతరం వారు ఆర్డిఓ ను కలిసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పాల్గొన్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరినట్లు తెలిపారు 

ఈకార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నయీమ్, మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు మచ్చ కవిత, మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం వేణుగోపాల్, కౌన్సిలర్లు ఎంబేరి నాగభూషణం, మోర్తాడ్ లక్ష్మీనారాయణ, ఎండిఅన్వర్, లోకిని వెంకీ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘ లింగం, పట్టణ ప్రధాన కార్యదర్శి నజ్జు , మ్యాకల నర్సయ్య, ఎంబేరి సత్యనారాయణ, చిటిమెల్లి రంజిత్ గుప్త, మైనారిటీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు వసీం, మాజీ కౌన్సిలర్ ఖయ్యుమ్,   పసుల కృష్ణ ప్రసాద్, తుపాకుల బాజన్న, మైనారిటీ సెల్ అధ్యక్షులు  ఎం డి రజి,  ఏఆర్ అక్బర్, సోగ్రాభి, చిట్యాల లక్ష్మీనారాయణ, బలిజ శివ,  వోలపు రాజేష్, గడేల అశోక్, దండిక కిషోర్, చిట్యాల సందీప్,  కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

.