తెలంగాణ ప్రభ (కోరుట్ల): కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు సీనియర్ సిటీజేన్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ర్ట కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ డిమాండ్ చేశారు.
ఆదివారం కోరుట్ల డివిజన్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ డీవిజన్ కార్యాలయంలో డివిజన్,మండల,గ్రామ ప్రతినిధులకు వయోవృద్ధుల సంరక్షణ చట్టం 2007 నియమావళి 2011 పై అవగాహన కల్పించారు.
అనంతరం అసోసియేషన్ ముద్రించిన సీనియర్ సిటీజేన్స్ పిలుపు పుస్తకాలను హరి ఆశోక్ కుమార్ ఆవిష్కరించి సంఘ సబ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా హరి అశోక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చే గుర్తింపు పొందిన తమ అసోసియేషన్ సేవలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అభినందించారన్నారు.
సీనియర్ సిటీజేన్స్ కోసం ప్రత్యేక సంక్షేమ శాఖ కేంద్రంలో, రాష్ట్రంలో ఏర్పాటు చేయాలన్నారు.
వృద్ధుల సమావేశ భవనం కోసం హైదరాబాద్ లో 2 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించి,భవన నిర్మాణం కోసం రూ.10 కోట్ల నిధులు కేటాయించాలని ,ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని,అన్నీ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యసేవలు అందించాలన్నారు.
అన్ని మున్సిపాలిటీల్లో వృద్ధుల కోసం సమీకృత డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని,టాస్కా కేంద్ర కార్యాలయంకు ప్రభుత్వ భవనం తగు సౌకర్యాలతో కేటాయించాలని,రైల్వే ఛార్జీల్లో వృద్ధులకు ఆపి వేసిన రాయితీలు పునరుద్ధరించాలని,తల్లిదండ్రుల,వృద్ధుల పోషణ సంక్షేమ చట్టము 2007 లో ప్రతిపాదించిన సవరణ బిల్లు 2019 ని కేంద్రంలో రాబోయే ప్రభుత్వం పార్లమెంట్ లో పెట్టి ఆమోదింప జేయాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో ,జిల్లా కౌన్సెలింగ్ అధికారి హన్మంత్ రెడ్డి, కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు, డివిజన్ కౌన్సెలింగ్ అధికారి పబ్బా శివానందం,కార్యదర్శి గంటేడి రాజ్ మోహన్, కోశాధికారి నల్ల లక్ష్మీ నారాయణ,ఉపాధ్యక్షుడు ఎం.డి.సైఫోద్దీన్ ,రాజయ్య,సాబితలి,లక్ష్మీకాంతం,గంగారాం,శ్రీరాములు,వెంకటేశ్వరరావు,కోరుట్ల,కథలాపూర్,మేడి పల్లి మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు.
.