అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం బోనమెత్తిన విశ్వబ్రాహ్మణులైన పురుషులు
తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): వర్షాలు సమృద్ధిగా కురవాలి చెరువు కుంటలు నిండాలి పాడిపంట పిల్లా జెల్లా ను సల్లంగా చూడాలని కోరుతూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బండ్ల బోనాల పండగ ఆదివారం ఘనంగా జరిగింది,
బండ్ల బోనాల సందర్భంగా గ్రామదేవతలైన పోచమ్మ , సార్గమ్మ , పెద్దమ్మ , మీదిప్యాట పోచమ్మ , నాయకమ్మ , శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం వరకు అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఎల్లారెడ్డిపేట విశ్వబ్రాహ్మణ సంఘం లో సంఘం ఆద్వర్యంలో పసుపన్నం , బెల్లం అన్నం , పెరుగు అన్నం. వంటలు చేసి బోనం శుద్ధి చేసి బోనం ఆలంకరించి బోనం లో పెట్టి నలుగురు పురుషులు ఎత్తుకోవడం విశేషం వారిలో చందనం నిరంజన్ , చందనం గోపాల్ , తుమ్మనపల్లి సుధాకర్ , కాసార్ల స్వామి బోనం ఎత్తారు వారి తో పాటు కుమ్మరి సంఘం తరపున కుమ్మరులు కూడా మూడు రకాలుగా వంటలు చేసి బోనం శుద్ధి చేసి బోనం ఆలంకరించి కుమ్మరి సంఘం తరపున ఇద్దరు బస్వాపురం చంద్రం , దుంపేట ఆంజవ్వ బోనము ఎత్తి 40 ఎద్దుల బండ్లు ట్రాక్టర్ల
ఎదుట ముందు వరుసలో గ్రామ దేవతలకు బోనం సమర్పించి గ్రామ ప్రధాన వీధుల గుండా పోచమ్మ గుడి నుంచి శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి చేరుకుంటారు , అక్కడినుండి సద్ది ముద్దుల వాడ ఆంజనేయస్వామి గుడి అనంతరం బండ్ల బోనాల ఊరేగింపు ముగింపు పలుకుతారు ,
బండ్ల బోనాల ఊరేగింపు కన్నుల పండగ జరిగింది,
బండ్ల బోనాల ఊరేగింపులో మాజీ ఎంపీటీసీ సభ్యులు ఓగ్గు బాలరాజు యాదవ్ రైతు చర్చ మండలి అధ్యక్షులు గుండాడి వెంకట్ రెడ్డి, బండారి బాల్ రెడ్డి, గుండాడి రాంరెడ్డి, రావుల మల్లారెడ్డి , పారిపెల్లి రాంరెడ్డి , పారిపెల్లి సంజీవరెడ్డి , నేవూరి సత్తిరెడ్డి. నేవూరి బాలయ్య గారి గోపాల్ రెడ్డి , సందుపట్ల భగవంత రెడ్డి , గడ్డం జితేందర్ , వివిధ కులాలకు చెందిన గ్రామస్తులు , రైతులు పాల్గొన్నారు,
.