రోడ్ షో కు బయలుదేరిన మండల బిజెపి నాయకులు

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండలంలోని ఎత్తోండ గ్రామం నుండి జగదీష్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుండి పార్టీ అధ్యక్షులు బిజెపి నాయకులు బాన్సువాడలోని నిర్వహిస్తున్న  రోడ్ షో కార్యక్రమానికి బయలుదేరి  వెళ్లారు  .కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై రాజాసింగ్   పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రోడ్ షోను నిర్వహించారు.  బిజెపి అభ్యర్థిని  బారి మెజార్టీతో గెలిపించాలని నాయకులకు ఓటర్లకు కోరారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి జహీరాబాద్ ఎంపీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు .అధిక సంఖ్యలో కోటగిరి మండలం నుండి బయలుదేరి వెళ్లారు. వారు మాట్లాడుతూ... పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బిజెపి అభ్యర్థిని గెలిపించాలన్నారు. మండల అధ్యక్షులు ఆయా గ్రామాల బిజెపి పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ కో కన్వీనర్లు మండలాల వారీగా బూత్  కేంద్ర ఇంచార్జీలు శక్తి కేంద్ర ఇన్చార్జిలో తదితరులు బయలుదేరి వెళ్లారు.

.