కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుంటాం : టిపిసిసి ప్రధాన కార్యదర్శి జ్యోత్స్నాశివారెడ్డి

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): మల్కాజిగిరి కాంగ్రెస్ ఇంచార్జ్ కరూర్ కాంగ్రెస్ ఎంపీ జ్యోతి మని, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇంచార్జి కోలన్ హనుమంత్ రెడ్డి మాజీ  ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తో కలిసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బూత్ లెవెల్ సమీక్షా సమావేశం లో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కందాడి జ్యోత్స్నా శివారెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మల్కాజ్గిరి అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి కి కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నుండి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాబోయే రోజులలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను పార్టీ గుండెల్లో పెట్టుకుంటుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పున్నారెడ్డి, కూన మహాలక్ష్మి ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

.