రహీంఖాన్ పేట గ్రామంలో బియర్ఎస్ ఎన్నికల ప్రచారం

తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట): ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్ పేట గ్రామంలో బియర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా మంగళవారం బియర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా,వైస్ ఎంపీపీ సుధగోని శ్రీనాథ్ ప్రచారం లో పాల్గొని మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బియర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం లో గ్రామ, మాజీ సర్పంచ్ బిళ్ళవేని పర్శరాములు గ్రామ శాఖ అధ్యక్షులు, ఏనుగుల పర్శరాములు కుస నరేష్,శ్రీకాంత్, పూదరి అoజయ్య మామిడి పర్శరాం గాదె కనకయ్య కొమ్ము కనకయ్య ఏనుగుల బుచ్చయ్య ఏనుగుల అనిల్, సాయిచరణ్ తదితరులు పాల్గొన్నారు

.