తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రముఖ వ్యాపారవేత్త వేముల మాణిక్యం కుటుంబ సభ్యులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు
ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావు వేముల మాణిక్యం కూతురు చింత రూపలత మాణిక్యం తదితరులకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు
ఈ సందర్భంగా వారందరూ కూడా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యునిగా తాటిపర్తి జీవన్ రెడ్డి విజయానికి కృషి చేస్తామని అన్నారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు కోరుట్ల పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ కొంతం రాజం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లేటి మహిపాల్ రెడ్డి మాజీ జెడ్పిటిసి సభ్యులు ఆకుల లింగారెడ్డి డాక్టర్ జె ఎన్ వెంకట్ ఎంబేరి నాగభూషణం ఆడేపు మధు పాల్గొన్నారు
.