తెలంగాణ ప్రభ (కోరుట్ల): 1తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మే డే వేడుకలు నిర్వహించారు. బుధవారం అసోసియేషన్ కార్యాలయంలో ఆరుగురు కార్మిక సీనియర్ సిటీజేన్లను సన్మానించారు.
ఈ సందర్భంగా టీ సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో చేపట్టిన సకల జనుల సమ్మెలో సింగరేణి,ఆర్టీసీ కార్మికులతో పాటు అన్ని వర్గాల కార్మికులు ,కర్షకులు అండగా నిలిచారన్నారు.
అభివృద్ధిలో కార్మిక రంగానిది కీలక పాత్ర అంటూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన చట్టాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,పెన్షనర్ల జిల్లా కార్యదర్శి బొల్లం విజయ్,సీనియర్ సిటీజేన్స్ జిల్లా కోశాధికారి వెలుముల ప్రకాష్ రావు,ఉపాధ్యక్షులు పి.సి.హన్మంత్ రెడ్డి,ఎం.డి.యాకూబ్,ఆర్గనైజింగ్ కార్యదర్శులు పి.ఆశోక్ రావు,సత్యనారాయణ,దిండిగాల విట్ఠల్,పట్టణ అధ్యక్షుడు పి.సతీశ్ రాజ్,కోశాధికారి సింగం గంగాధర్,గంగం జలజ,బక్కశెట్టి లక్ష్మీ,మొగులోజి విజయ, ఎం.డి.ఎక్బాల్,సయ్యద్ యూసుఫ్,యాకూబ్ హుస్సేన్,డేవిడ్,సామ సత్యం రావు,చిట్ల గంగాదర్ ,సీనియర్ సిటీజేన్స్,కార్మిక,కర్షక ,శ్రామిక వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు.
.