తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా మెటుపల్లి పట్టణంలోని విశాల సహకార సంఘం నూతన అధ్యక్షుడిగా కొమిరెడ్డి తిరుపతిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
విశాల సహకార సంఘ భవనంలో డి సి ఓ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నిక సమావేశంలో పదిమంది డైరెక్టర్లు హాజరు కాగా ఏకగ్రీవంగా 9 మంది డైరెక్టర్లు కొమిరెడ్డి తిరుపతిరెడ్డి కి మద్దతు తెలపడంతో నూతన అధ్యక్షుడిగా కొమిరెడ్డి తిరుపతి రెడ్డి ఎన్నికైనట్టు డి సి ఓ సత్యనారాయణ ప్రకటించారు.
అనంతరం ఎన్నికైన నూతన అధ్యక్షుడు కొమిరెడ్డి తిరుపతిరెడ్డి ని శాలువా పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు.
పలువురు నాయకులు అభినందించారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోరుట్ల నియోజకవర్గ నర్సింగరావు నూతన అధ్యక్షుడు కొమిరెడ్డి తిరుపతిరెడ్డి ని ఘనంగా సన్మానం చేశారు.
అనంతరం నూతన అధ్యక్షులు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ. మా 9 మంది డైరెక్టర్ల సహకారంతో నేను అధ్యక్షున్ని కావడం జరిగింది.
జువ్వాడి నర్సింగారావు. జువ్వాడికృష్ణారావు.కొమిరెడ్డి కరంల సహకారంతో అధ్యక్ష బాధ్యతలు చేపట్టానని వారి సహకారంతో పాలకమండలి అభివృద్ధి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిసిఓ సత్యనారాయణ సీనియర్ ఇన్స్పెక్టర్ నిజాముద్దీన్, ఉపాధ్యక్షులు సులుకంటి సంజీవరెడ్డి ,డైరెక్టర్స్ అల్లూరి రాజేశ్వర్ రెడ్డి, గాజా రాజారెడ్డి,
చెర్లపల్లి హనుమాన్లు గౌడ్, శ్రీనివాస్,రాములు,ప్రమీల,సరోజా, గోరువంతుల మారుతి తదితరులు పాల్గొన్నారు .
.