తెలంగాణ ప్రభ (కోరుట్ల) కన్నతల్లిదండ్రులను పోషించక నిరాధరిస్తున్న కొడుకులు ,కోడళ్లకు తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు కౌన్సెలింగ్ చేయడంతో తాము తమ తల్లిదండ్రులను పోషిస్తూ,బాగోగులుచేసుకోవడానికి సమ్మతించి ఒప్పంద పత్రం రాసిచ్చారు.
మంగళవారం అసోసియేషన్ కార్యాలయంకు ఆ కొడుకులు,కోడళ్లను ఆ తల్లిదండ్రుల అభ్యర్థనపై పిలిపించి వయోవృద్ధుల చట్టంపై అవగాహన కల్పించి,తల్లిదండ్రులను పోషించక నిరాదరణకు గురిచేస్తే ట్రిబ్యునల్ అధికారి ఆర్డీవోకు 6మాసాలకు పైగా జైలు శిక్ష,జరిమానా విధించే వీలు ఆ చట్టంలో ఉందని,మాయ మాటలతో,బెదిరింపులతో వారి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకున్నా, అట్టి ఆస్తులు తిరిగి ఆ తల్లిదండ్రుల పేరిట మార్పిడి చేసే అధికారం జిల్లా కలెక్టర్ కు ఉందని కౌన్సెలింగ్ చేశారు.
జిల్లా కేంద్రానికి చెందిన చెల్కల అనసూయను ఆమె ముగ్గురు కుమారులు పోషించడం లేదని ,పెద్ద కోడలు,చిన్న కోడలు వేధింపులకి గురి చేస్తున్నారని , వెల్కటూర్ మండల కేంద్రానికి చెందిన 20 ఏళ్లుగా జగిత్యాలలో అద్దెకు ఉంటు కూరగాయలు అమ్ముకుంటూ, జీవిస్తున్న గంటాల హన్మాండ్లు,రాజమ్మఅనే వృద్ధులను జగిత్యాలలోనే చిరు వ్యాపారాలు చేసుకుంటున్న ఇద్దరు కుమారులు తమను పోషించడం లేదని,కోడళ్లు వేధింపులకు గురిచేస్తున్నారని , సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ కు ఫిర్యాదు చేయడంతో అసోసియేషన్ ప్రతినిధులు గౌరిశెట్టి విశ్వనాథం,వి.ప్రకాశ్ రావు, పట్టణ ఆద్యక్షుడు పి.సతీశ్ రాజ్ ,ఎం.డి.యాకూబ్ తదితర సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆ కనికరం లేని కొడుకులు,కోడళ్లకు మంగళవారం ఆర్డీవో కార్యాలయ ఆవరణలో ఉన్న అసోసియేషన్ కౌన్సెలింగ్ కేంద్రంలో కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఆ కొడుకులు,కోడళ్లు ఆ తల్లిదండ్రులను పోషిస్తామని,లేకుంటే తమపై చట్ట ప్రకారము ట్రిబ్యునల్ చైర్మన్ అయిన ఆర్డీవో కు కేసు దాఖలు చేసి చర్యలు తీసుకోవాలని ఒప్పంద పత్రం స్టాంప్ పేపర్లపై రాసిచ్చారు.
ఈ కౌన్సెలింగ్ ల్లో తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజన్స్ అస్సోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ , జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,ఉపాధ్యక్షులు బొల్లం విజయ్, పి.హన్మంత్ రెడ్డి,ఎం.డి.యాకుబ్,ఆర్గనైజింగ్ కార్యదర్శి పూసాల ఆశోక్ రావు, పట్టణ అధ్యక్షుడు పి.సతీశ్ రాజ్,కొయ్యడ సత్యనారాయణ, బోబ్బాటి కరుణ,కొడుకులు,కోడళ్లు,తల్లి,తండ్రులు పాల్గొన్నారు.
.