తాళం వేసిన ఇంట్లో చోరీ - పదిర బిజెపి నాయకుడి ఇంట్లో ఘటన

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన కుంభాల మహేందర్ రెడ్డి దుబాయిలో నివసిస్తుండగా తన భార్య సుచిత్ర ఆమె కుమారుడికి వీసా పంపి దుబాయ్ కి  తీసుకువెళ్లారు. వేసవికాలం సెలవులు ఉండడంతో విసిటింగ్ లో వెళ్లినట్లు తెలిసింది. తమ ఇంటికి తాళం ఉండడంతో  గుర్తు తెలియని దుండగులు ఆదివారం అర్ధరాత్రి తమ ఇంటి ఆవరణలో ఉన్న స్కూటీ, పదివేల నగదు, ఒక్క సెల్ ఫోన్ ఎత్తుకెళ్లినట్లు  సమాచారం. జరిగిన ఘటన పట్ల బాధితుడు సెల్ఫోన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  పేర్కొన్నారు.

.