అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించి ఆశీర్వదించినట్టే
పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల ను గెలిపించి రాహూల్ గాంధీ నీ ప్రధానమంత్రిగా చేయాలే
బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డిలు
తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): బిజెపి , బీఆర్ఎస్ పార్టీలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆశీర్వదించినట్టే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు,
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100 రోజుల్లో ఇస్తానన్న ఆర్ గ్యారంటీలు అమలు చేసి చూపాడన్నారు, ప్రజలను మోసం చేసిన ఘనత బిజెపి ప్రభుత్వానికే దక్కింద న్నారు,
పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని బధనాం చేస్తూ బిజెపి నాయకులు పంచి పెడుతున్న కరపత్రాలలో నిజం లేదన్నారు
బిజెపి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో కాలంలో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేసిందన్నారు, బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత ఆయనకు గాని బిజెపి పార్టీకి గాని లేదన్నారు,
బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ బిజెపి పార్టీ పంచి పెడుతున్న కర పత్రాల్లో నిజం లేదని తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన తీవ్రంగా విమర్శించారు ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలు అమలు చేశామని మహాలక్ష్మి కింద మహిళలకు పెన్షన్ రైతులకు బోనస్ 500 రూపాయలు , రెండు లక్షల బుణ మాఫీ ఎన్నికల కోడ్ ఉన్నందున ఇవ్వలేకపోతున్నామని ఆయన గుర్తు చేశారు,
బిజెపి ప్రభుత్వం బ్యాంకు ఖాతాలు తెరువుమని చెప్పి ఇప్పటివరకు ఒక పైసా వేయకుండా ప్రజలను మోసం చేసిందని ప్రతి యేటా యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన బిజెపి పార్టీని రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి అవినీతి ఆక్రమాలకు పాల్పాడిన బిఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థులను గెలిపించాలనీ ఇప్పటికే ప్రజలు డిసైడ్ అయ్యారన్నారు,
ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిల్ల లింగం గౌడ్, వంగ గిరిధర్ రెడ్డి , కొత్తపల్లి దేవయ్య , గుండాడి రామ్ రెడ్డి, గుర్రపు రాములు , బండారి బాల్ రెడ్డి , గంట బుచ్చాగౌడ్ , మద్దుల శ్రీపాల్ రెడ్డి మాలోత్ రామచంద్రం. నాయక్, పొన్నాల మల్లారెడ్డి. కంకనాల శ్రీ నివాస్, సోషల్ మీడియా ప్రతినిధి బీపేట రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు,
.