తెలంగాణ ప్రభ (కోటగిరి): పోతంగల్ మండల కేంద్రంలో షాదిఖాన కార్యాలయంలో ఆదివారం బాన్సువాడ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బూతు స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం పోతంగల్ నూతన గ్రామ కమిటీని ఎంపిక చేసి అధ్యక్షులుగా పుల్కంటి సాయిలు, ఉపాధ్యక్షులుగా గజ్జల శివ, ఎన్. రాజు, ఏస్థాని దేశాయ్, సోనాయి శ్రీనివాస్, గౌరు హన్మాండ్లు, జనరల్ సెక్రెటరీగా ఖాలీక్ ను ఏకిగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని మండల పార్టీ అధ్యక్షుడు పుప్పాల శంకర్ తెలిపారు. బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ను కార్యకర్తలందరూ కలసి కట్టుగా ఎన్నికల్లో పనిచేసి భారీ మెజార్టీని ఇవ్వాలని పొతంగల్ మండల కార్యకర్తలకు , గ్రామాల బూత్ స్థాయి కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు పుప్పాల శంకర్, ఎంపీటీసీ కేశ వీరేశం మాజీ వైస్ ఎంపిపి గంధపు పవన్, ఎలమంచిలి శ్రీనివాసరావు, బజరంగ్ దత్తు,దన్ రాజ్, మన్సూర్, రాజు, మాజీ ఎంపీటీసీ హనుమంతరావు పటేల్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
