హత్నూర మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ వరిగుంతం కృష్ణ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు

తెలంగాణ ప్రభ (హత్నూర):  ఈరోజు సంగారెడ్డి జిల్లా హత్నూర మండల్ నస్తీపూర్ గ్రామంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మాజీ శాసనసభ్యులు మదన్ రెడ్డి రావడం జరిగింది డాక్టర్ వరిగుంతం కృష్ణ మాట్లాడుతూ భారతరత్న మహా మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించడం మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి అందుకే దేవుడు  మీద కానీ ఆధార పడవద్దు అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆనాడు చెప్పడం జరిగింది కావున అంతటి మహనీయుని మన భారత రాజ్యాంగాన్ని నిర్మించినందుకు మనం ఎంతో సంతోషం వ్యక్తం చేసుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు హత్నూర మండల్ జడ్పిటిసి ఆంజనేయులు దుర్గా రెడ్డి తోటరాజు సాయిలు నస్తీపూర్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు రాజు శ్రీనివాస్ శివాజీ హరీష్ నవీన్ గోవు శ్రీకాంత్ అంబేద్కర్ యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజల అందరికీ శుభాకాంక్షలు జై భీమ్

.