కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుంది: మైనంపల్లి హనుమంత్ రావు
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కుత్బుల్లాపూర్ కబ్జాలకు అడ్డగా మారింది: కూన శ్రీశైలం గౌడ్
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 పార్లమెంట్ సీట్లు గెలుస్తుందని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ నుండి ఈరోజు సుమారు 1000 మండి బిఆర్‌ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్వర్యంలో మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇంచార్జ్ మైనంపల్లి హన్మంతరావు ,మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ,కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ బండ్రు శోభారాణి , టిపిసిసి ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం చేరారు.
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల ఉన్న నమ్మకం, ప్రజాకర్షక పాలన పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్, బిజెపి పార్టీలు ఖాళీ అవ్వడం ఖాయమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు కుత్బుల్లాపూర్ కబ్జాలకు అడ్డాగా మారిందని అన్నారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన భారతీయ జనతా పార్టీని ఎవరూ పట్టించుకోరని అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి బలపరిచిన మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్ధి సునీత మహేందర్ రెడ్డి ని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ లోని కార్పొరేటర్లు చిట్ల దివాకర్,సురేష్ రెడ్డి,ఆవుల పావని జగన్ యాదవ్ ,రాజేశ్వరీ వెంగయ్య చౌదరీ,కోలన్ వీరేందర్ రెడ్డి,G. శ్రీనివాస్ యాదవ్,ప్రసన్న జగదీష్ యాదవ్,ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి,కో ఆప్షన్ సభ్యురాలు వాణి స్టీఫెన్ పాల్, కాంగ్రెస్ అధ్యక్షుడు కోలన్ రాజశేఖర్ రెడ్డి,మహిళా అధ్యక్షురాలు ఇందిరా,మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ మహిళా జెనరల్ సెక్రెటరీ రఫియా బేగం,సీనియర్ నాయకులు చల్లా సుధీర్ రెడ్డి,ఏనుగుల శ్రీకాంత్ రెడ్డి,ఆవుల జగన్ యాదవ్, వెంగయ్య చౌదరీ,ఆవుల జగదీష్ యాదవ్,నాగరాజ్ యాదవ్, ఆశి మల్లేష్,తలారి సాయి ముదిరాజ్,సురేందర్ కుమార్ యాదవ్,మహేందర్,సుదర్శన్ రెడ్డి, సుబ్బారెడ్డి,సీనియర్ మహిళా నాయకురాలు సబిత జలంధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
.