కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న టి పి సి సి ప్రధాన కార్యదర్శి జ్యోత్స్నాశివారెడ్డి

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జీడిమెట్ల,  పేట్ బషీరాబాద్ లో ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యం లో జరిగిన ఎన్నికల  సమావేశం లో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జ్యోత్స్నా శివ రెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పట్నం సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. మన కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి పున్నారెడ్డి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు  కిషోర్ రెడ్డి మేడ్చల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్ష్మి ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆడం సుజన్, ప్రధాన కార్యదర్శి గొల్ల జాన్, వినయ్, పృథ్వీరాజ్, రాజేష్ ముదిరాజ్ ,తదితరులు పాల్గొన్నారు.

.