సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి

తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన రైతులు.

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి గ్రామ శివారులో  120  ఎకరాల్లో  సన్ ఫ్లవర్  సాగు చేయడం  జరిగిందని రైతులు తెలిపారు.  ప్రభుత్వం తరఫున సన్  ఫ్లవర్  కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని తహసిల్దార్ కు,మండల వ్యవసాయ అధికారికి  వినతిపత్రం అందజేశారు. రైతులు మాట్లాడుతూ.. వడగళ్ల వాన కురవడంతో పండించిన సన్ ఫ్లవర్  నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే  కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి  రైతులను ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు శంకర్, హనుమాన్లు, గజేందర్, మాలకొండ రెడ్డి, సాయిలు,రమేష్, రాజు ,గంగారం ,శ్రీనివాస్,పి. సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

.