రాధారపు సత్యం సహకారంతో చలివేంద్రం ప్రారంభించిన లయన్స్ క్లబ్- గత ఆరు సంవత్సరాలుగా చలివేంద్రాల ఏర్పాటు

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): మండుటెండలు  సమీపిస్తున్న సందర్భంగా ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని  తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థంతో ఏర్పాటు చేసి  తన ఔధార్యాన్ని చాటుకున్నాడు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం స్థానిక కొత్త బస్టాండ్ లో బుధవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దుబాయ్ ఈ టి సి అధ్యక్షులు రాధారపు సత్యం తన తల్లిదండ్రులు రాధారపు రాజయ్య లక్ష్మి జ్ఞాపకార్థంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని  రాధారపు శంకర్,పయ్యావుల రామచంద్రం, నంది కిషన్, సద్ది లక్ష్మారెడ్డి,ముత్యాల శ్రీనివాస్ రెడ్డిలు కలిసి ప్రారంభించారు.గత ఆరు సంవత్సరాలుగా వేసవికాలంలో  చలివేంద్రాలను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా లైన్స్ క్లబ్  క్యాబినెట్ మెంబర్  నంది కిషన్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సత్యం సోదరుడు రాధారపు శంకర్, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పయ్యావుల రామచంద్రం, క్యాబినెట్ మెంబర్ ముత్యాల శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, నాయకులు బండారి బాల్ రెడ్డి, డాక్టర్ అమరేందర్ రెడ్డి, రావుల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

.