తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) కూకట్ పల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ బస్తీలో అక్రమంగా వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి నీటిని విక్రయిస్తూ భూగర్భ జలాలను ఎండగడుతున్న వాటర్ ప్లాంట్ నిర్వాహకులపై బస్తి వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు చంద్ర రెడ్డి సమక్షంలో వీరాంజనేయ శివాలయం సమీపంలోని 15, 16 మధ్య రోడ్లో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమానికి బస్తివాసులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి అక్రమ వాటర్ ప్లాంట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. అడుగంటుతున్న భూగర్భ జలాలతో రానున్న రోజుల్లో పాపిరెడ్డి నగర్ బస్తీలో నీటి కొరత తీవ్ర రూపం దాల్చే ఆస్కారం ఉందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. భూగర్భ జలాలను తోడేస్తున్న అక్రమ వాటర్ ప్లాంట్లను తొలగించేందుకు అధికారులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని హెచ్చరించారు. భూగర్భ జలాలను కాపాడాల్సిన అధికారులు నిద్రావస్థను వీడి బస్తీ వాసుల సమస్యను పరిష్కరించేందుకు పాటుపడాలన్నారు. ఇకనైనా ఉన్నత అధికారులు మేలుకొని బస్తీలో వెలసిన అక్రమ వాటర్ ప్లాంట్లను వెంటనే తొలగించి భావితరాలకు ఉపయోగపడాల్సిన నీటిని కాపాడాల్సిన బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు తీరులో మార్పు రాకపోతే బస్తి వాసులందరూ ఏకమై వాటర్ ప్లాంట్లను తొలగించాల్సిన పరిస్థితి ని తీసుకురావద్దని హెచ్చరించారు. కొంతమంది స్థానిక నేతలు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించడంతో బస్తీలో వాటర్ ప్లాంట్లు యదేచ్చగా చలామణి అవుతున్నాయన్నారు. నిత్యం అక్రమ వాటర్ ప్లాంట్ల ద్వారా లక్షల లీటర్ల విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న వాటర్ ప్లాంట్ దళారులపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావుతీస్తుందన్నారు. ఇదే విషయమై పలుమార్లు జిల్లా కలెక్టర్ కు, కూకట్పల్లి మండల తాసిల్దార్ కు, కూకట్ పల్లి జిహెచ్ఎంసి అధికారులకు, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన సమస్యకు పరిష్కారం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు మేలుకొని సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి తక్షణమే అక్రమ వాటర్ ప్లాంట్లను తొలగించి బస్తివాసులకు వేసవిలో నీటి కొరత లేకుండా చూడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఆ భగవంతు రెడ్డి క్యాషియర్ నరసింహులు ముదిరాజ్ సిహెచ్ ,రామకృష్ణారెడ్డి. ఎం అనంతరం ములు పేర్ని ధర్మారావు హనుమంత రెడ్డి. చంద్రయ్య శేఖర్ రెడ్డి శరత్ రెడ్డి జగదీషకిరణ్. శివ .జిబి ,కన్నారావు. ఆంజనేయులు. బాగిరెడ్డి. పాండు గౌడ్ .పెంటయ్య గౌడ్ .ఇంద్రసేనారెడ్డి.ఎస్ యాదగిరి మేస్త్రి. బాల్ రెడ్డి. వీరబాబు. గోపాల్ చిట్టిబాబు.మోహన్ రెడ్డి ప్రతాపరెడ్డి ఎం కనకారెడ్డి తిరుపతిరెడ్డి. రాజిరెడ్డి అరుణ అక్క. పద్మ. శోభ. లత..పద్మ .మనమ్మ. పెద్ద ఎత్తున బస్సు ప్రజలు పాల్గొన్నారు.
